Showing posts with label బెల్లం. Show all posts
Showing posts with label బెల్లం. Show all posts

Monday 19 April 2021

బెల్లం వలన కలిగె ప్రయోజనాలు | Jaggery Benefits

బెల్లం (Jaggery) ఒక తియ్యని ఆహార పదార్ధము. చక్కెర కూడా తీపి పదార్థమే అయినా.. బెల్లం తీసుకుంటే మంచి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

దీనిని సాధారణంగా చెరకు రసము నుంచి మొలాసిస్ ను వెలికితీసి బెల్లము తయారు చేస్తారు

బెల్లంలో ఉండే పోషక విలువలు (100 గ్రాములకు)

కాలోరీస్ ------------------19 cal/tbsp, or 383 cal / 100 grms

విటమిన్ బి కాంప్లెక్ష్ --------1 g/kg,

ఫోలిక్ ఆసిడ్ ------------- 1 mg /kg,

ఐరన్ --------------------2.6 mg /100 Grms,

క్యాల్షియం ------------------80 mg /100 Grms,

ఫాస్ఫోరస్---------------- 30–40 mg / 100 Grms,

మెగ్నీషియం -------------70-90 mg / 100 Grms,

పొటాసియం -------------1050 mg / 100 Grms,

మాంగనీస్ ------------ 0.2–0.5 mg

సుక్రోస్ Sucrose: 65–85 grams.

ఫ్రక్టోస్ అండ్ గ్లూకోస్ Fructose and glucose: 10–15 grams.

ప్రోటీన్లు --------------- 0.4 grams

ఫాట్ --------------- 0.1 grams.


బెల్లం వలన కలిగె ప్రయోజనాలు:

ఖనిజాలు అధిక స్థాయిలో ఉంటాయి :

తెల్లని చక్కెరలా కాకుండా, బెల్లంలో ఖనిజాలు మరియు ఐరన్ అనేవి ప్రత్యేకంగా ఉంటాయి. శరీరానికి అవసరమైన అతి ముఖ్య ఖనిజాలను అందించి శరీర పనితీరును మెరుగుపరుస్తుంది మరియు అవయవాలు వృద్ధికి సహాయపడుతుంది.

మలబద్దకం నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది :

బెల్లంలో ఫైబర్ను కలిగి ఉండటం వలన మలబద్ధకం నుండి ఉపశమనాన్ని కలిగించడానికి సహాయపడుతుంది ఎందుకంటే, ఇది ప్రేగుల కదలికలను ఉత్తేజపరిచేలా సహాయపడుతుంది.

వ్యాధినిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది :

ఇది మన శరీరంలో ఉన్న రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచి, వ్యాధులకు వ్యతిరేకంగా మన శరీరము ప్రతిఘటించేలా దాని పనితీరును మరింత పెంచుతుంది.

శ్వాస సంబంధమైన రుగ్మతలకు చికిత్స :

ముందు చెప్పినట్లుగా, బెల్లంలో శుభ్రపరిచేందుకు మరియు శోథ నిరోధక లక్షణాలతో సంయుక్తంగా కలిసి వివిధ రకాల శ్వాస సంబంధమైన రుగ్మతలను తగ్గించడంలో సహాయపడతాయి. బెల్లం అనేది చాలా సంవత్సరాల నుండి అలెర్జీలకు వ్యతిరేక కారకంగా ఉపయోగించబడుతున్నది.

బెల్లం వల్లన స్త్రీలకు కలిగే ప్రయోజనాలు :

ప్రతిరోజు ఒక చెంచా బెల్లాన్ని మహిళలు వినియోగించటం వల్ల చాలా ప్రయోజనాలను పొందగలరు. ఇది వారి శరీరంలో అనేమియా (రక్తహీనతను) నిరోధించడానికి మరియు ఋతు-సమస్యలను నివారించడానికి సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇది మహిళల గర్భధారణ సమయంలో ఎర్రరక్త కణాల యొక్క స్థాయిని పెంచుటకు సహాయపడుతుంది. కాబట్టి, బెల్లాన్ని అధికంగా తీసుకోవటం వలన గర్భధారణ సమయంలో స్త్రీలు తమ శక్తిని పెంచుకోవచ్చు, దాని వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు.

బెల్లం వల్లన మగవారికి కలిగే ప్రయోజనాలు :

రోజువారీ ఆహారంలో బెల్లాన్ని తీసుకోవటం వలన మగవారు చాలా రకాల ప్రయోజనాలను పొందగలరు. ఉసిరి పొడితో కలిపి బెల్లమును తినడం వలన మగవారిలో నాణ్యమైన శుక్రకణాలను పొందగలరు మరియు దాని యొక్క స్థాయిని బాగా పెంచ్చుకోగలరు. అలాగే ఇది తక్షణ శక్తికి మూల పదార్థంగా కూడ వుంది.

పాలు బెల్లం కలిపిన పానీయం

బరువు తగ్గడంలోనూ బాగా పని చేస్తుంది

మీరు త్వరగా బరువు తగ్గాలంటే పాలు బెల్లం కలిపిన ద్రావణాన్ని రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండండి. మీరు బరువు తగ్గడానికి కూడా ఈ ద్రావణం బాగా పని చేస్తుంది.

అజీర్ణం సమస్య పోతుంది

చాలామంది అజీర్ణం సమస్యతో బాధపడుతుంటారు. మీరు అజీర్ణం, మలబద్ధకం తదితర సమస్యలతో బాధపడుతున్నట్లయితే మీకు పాలు బెల్లం కలిపిన పానీయం మీకు బాగా పని చేస్తుంది. దీన్ని తాగడం వల్ల అజీర్ణం సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చు.

ఋతుక్రమ సమస్యలను తగ్గిస్తుంది

ఋతుక్రమం సమస్యలను, అప్పుడొచ్చే నొప్పులు పాలు+బెల్లం కలిపిన ద్రావణం వల్ల మటుమాయం అవుతాయి. చాలామంది ఆడవారు ఆ సమయంలో నొప్పి, తిమ్మిరిలతో బాధపడుతుంటారు. మహిళలు ఋతుస్రావం సమయంలో పాలు+బెల్లం కలిపిన ద్రావణం తాగితే మంచి ఫలితం ఉంటుంది. 

జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది

పాలు, బెల్లం కలిపిన ద్రావణం మీ జీర్ణక్రియను బాగా మెరుగుపరుస్తుంది. అలాగే జీవక్రియ రేటును పెంచుతుంది. అజీర్తి సమస్య వల్ల చాలామంది చాలారకాలుగా ఇబ్బందులుపడుతుంటారు. అయితే వీటన్నింటికీ దీని ద్వారా మంచి ఉపశమనం లభిస్తుంది.