Showing posts with label beautiful skin. Show all posts
Showing posts with label beautiful skin. Show all posts

Monday 19 April 2021

చర్మ(skin) సౌందర్యాన్ని పెంచే ఆహారపదార్థాలు || Best Foods for beautiful skin

 చర్మ సౌందర్యానికి  ఉపయోగపడే ఆహారపదార్థాలు

కొన్ని ఆహారపదార్థాలు వయసు కనిపించనీయకుండా చర్మం మెరిసేలా చేస్తాయి. సాధారణంగా  మనం తీసుకునే ఆహారమే మన అందాన్ని, ఆరోగ్యాన్ని నిర్దేశిస్తుంది. 

మనం తినే ఆహారం ద్వారానే చర్మానికి కావలసిన పోషణ లభిస్తుంది. ‘చర్మం పేలవంగా, ముడతలు పడ్డట్టుగా, ఉన్నదానికన్నా వయసు మీద పడినట్టుగా కనిపిస్తోందంటే ఆహారం పట్ల మనం సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదన్నమాట'. 

చర్మం లోపలిపొర కింద ఉండే పొరని డెర్మిస్ అంటారు. ఇది మన చర్మానికి జీవాన్నిస్తుందని చెప్పవచ్చు. ఇక్కడ ఉండే నరాల చివర్లు, రక్తనాళాలు, నూనె, శ్వేత గ్రంధులు స్పర్శని కల్పించటంతోపాటు చర్మం ఊపిరి పీల్చుకోవటానికి సహాయపడతాయి. అయితే వీటితోపాటు కొలాజెన్, ఎలాస్టిన్, కెరటిన్ అనే అతి ముఖ్యమైనవి కూడా డెర్మిస్ పొరలో ఉంటాయి. పీచులాగా సాగే గుణం ఉన్న మాంసకృత్తులు ఇవి. 

మన శరీర పటుత్వం, ఆరోగ్యం, వంచ గలిగే శక్తిని ఎలాస్టిన్ నిర్దేశిస్తే, 

కొలాజన్ వృద్ధాప్యపు జాడలతో పోరాటం చేస్తుంది. వృద్ధాప్యపు ఛాయ కూడా దరిచేరకుండా చేస్తుంది

కెరటిన్ శరీర దారుఢ్యాన్ని పెంచి హుషారుగా ఉంచుతుంది . 

అయితే అందంగా, ఆరోగ్యమైన చర్మం కోసం దోహదపడే ఆహారాలు

బాదం :  చర్మ సౌందర్యానికి ఎంతో అవసరమయ్యే విటమిన్‌ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు బాదం పలుకుల్లో పుష్కలంగా ఉంటాయి. రోజూ నాలుగు బాదం పలుకుల్ని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన తింటే మంచిది. నానబెట్టిన బాదం పొప్ప్ను ఉదయాన్నే తిసుకుంటే చర్మం పొడిబారదు.

పాలకూర :  విటమిన్‌ ఎ, బీటా కెరాటిన్‌లు వయసు ఛాయలు రాకుండా చర్మాన్ని కాపాడతాయి. ఇవి పాలకూరలో పుష్కలంగా ఉంటాయి. దీనిని రోజూ ఆహారంలో తీసుకుంటే నలభైలలో కూడా చర్మం మెరుస్తూ కనిపిస్తుంది. 

సబ్జా గింజలు : చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో సబ్జాగింజలు ముందుంటాయి. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. రోజూ ఒక స్పూను సబ్జాగింజల్ని తింటే చర్మం యౌవనంగా ఉంటుంది. 

టొమాటోలు :  ఇందులో లైకోపీన్‌ చర్మానికి మంచి మెరుపుని అందిస్తుంది. ఇందులో యాంటీ ఏజింగ్‌ లక్షణాలు చాలా ఎక్కువ. కాలుష్యం నుంచి, హానికారక సూర్యకిరణాల నుంచి లైకోపీన్‌ కాపాడుతుంది.

చేపలు:   సాల్మన్ ఫిల్ లో ఓమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కలిగి ఉంటాయి. ఈ ఒమేగా యాసిడ్స్ మన శరీరానికి ఎంతో ఉపయోగపడి, కొలాజెన్ ఉత్పత్తి పెరగటానికి తోడ్పడే వీటిని మన శరీరం తయారుచేసుకోలేదు. మనం తినే ఆహారం ద్వారానే వీటిని సమకూర్చాలి. చేపలు (ముఖ్యంగా సాల్మన్, ట్యునా వెరైటీ), జీడిపప్పు, బాదాం పప్పు. ఇది కొలాజెన్ ఉత్పత్తికి ఎంతో కీలకమైనది.

సోయా ప్రొడక్ట్స్:   సోయా ప్రొడక్ట్ లో కూడా విటమిన్ సి తో పాటు జింక్ కూడా అధికంగా ఉంటుంది. సోయా మిక్క్ మొటిమలు, మచ్చలు పోగొట్టి, చర్మసమస్యలను దూరం చేస్తుంది. నిర్జీవమైన చర్మాన్ని తాజాగా చేసి ఫ్రెష్ గా మార్చుతుంది. కాబట్టి సేయాబేస్డ్ ప్రొడక్ట్ , సోయా పాలు తాగడం మంచిది.

క్యారెట్స్:    ఇందులో ఉండే బీటా కెరోటీన్, మన శరీరంలో విటమిన్ ఎ గా మారుతుంది. ఇది దీర్ఘకాలం చర్మం ముడతలు పడకుండా చేస్తుంది.

బీట్ రూట్:   రూట్ దుంపల్లో అధిక శాతంలో ఐరన్ మరియు విటమిన్స్ ఉండి, చర్మగ్రంధులను శుభ్రం చేయడానికి, రక్త ప్రసరణ జరగడానికి, ముఖంలో పింక్ గ్లో తేవడానికి సహాయపడుతాయి. కాబట్టి ప్రతి రోజూ ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్ తాగాలి. 

కీర దోస:   దోసకాయను తొక్కుతో తినడం మంచిది. తొక్కులో విటమిన్‌ 'కె' సమృద్ధిగా ఉంటుంది. చర్మానికి మేలు చేసే గుణం దోస తొక్కులో వుంది. దోసకాయ మంచిది కదా అని ఊరగాయల రూపంలో తినకూడదు. కీరదోసకాయ రసాన్ని ముఖానికి పట్టిస్తే నల్లటి మచ్చలు పోతాయి. 

సిట్ర‌స్ పండ్లు : నారింజ‌, కివి, నిమ్మ వంటి సిట్ర‌స్ జాతి పండ్ల‌ను నిత్యం తీసుకుంటున్నా చ‌ర్మం కాంతివంతంగా మారి, మృదువుగా త‌యార‌వుతుంది. వీటిలో ఉండే విట‌మిన్ సి చ‌ర్మ సంర‌క్ష‌ణ కోసం ఉపయోగ‌ప‌డుతుంది.

బొప్పాయి:  బొప్పాయి బొప్పాయిన మన పూర్వీకుల నుండి ఉపయోగిస్తున్నారు. పాపాయలో ఎక్కువగా యాంటీఆక్సిడెంట్స్ మరియు ఎంజైములను ఫుష్కలంగా...

ఆపిల్స్:   యాపిల్స్‌లో విట‌మిన్ సి, ఆస్కార్బిక్ యాసిడ్‌లు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి చ‌ర్మాన్ని ముడ‌త‌లు ప‌డ‌నీయ‌కుండా చూస్తాయి. యాపిల్స్‌లో ఉండే కాప‌ర్ సూర్యుని నుంచి వచ్చే అతి నీల‌లోహిత కిర‌ణాల నుంచి మ‌న‌ల్ని ర‌క్షిస్తుంది. వీటిలోని విట‌మిన్ ఎ వృద్ధాప్య ఛాయ‌ల‌ను ద‌రిచేర‌నీయ‌దు.

వేరు శనగ :  వేరు శనగల్లో అధిక మోతాదులో ఉండే విటమిన్ ఇ, సిలీనియం, జింక్ శరీర సౌందర్యానికి కావలసిన హార్మోన్ ల ఉత్పత్తిలో సహకరిస్తాయి. రక్తప్రసరణ మెరుగుపరచి మంచి ఆరోగ్యంతో పాటు చర్మ సౌందర్యానికి ఉపకరిస్తాయి.

నీరు:  ప్రతి రోజూ 8-10 గ్లాసుల నీరు తాగడం వల్ల శరీరానకి కావల్సిన తేమ అంది ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంచుతుంది. రోజు క నీసం 6-8 గ్లాసుల నీళ్లు తాగటం వల్ల స్వేదగ్రంథుల నుంచి విషపదార్థాలను బయటికి విసర్జింస్తుంది.

కలబంద: కలబందను కొన్ని రోజులపాటు చర్మానికి రాసుకుంటే ఫలితం కనబడుతుంది.

తేనె: తేనెను అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల చర్మం పొడిబారకుండా తాజాగా ఉంటుంది.

సన్ ఫ్లవర్ సీడ్స్: లినోలిక్ ఫ్యాటీ యాసిడ్ అన్నది శరీరానికి అవసరమైన ఒక రకం పోషకం. ఆహారం ద్వారా దాన్ని తగినంతగా శరీరానికి అందేలా చూస్తే వృద్ధాప్యం త్వరగా దరిచేరే సమస్యే ఉండదు. చర్మం పొడిబారదు.

శరీరానికి ప్రాణవాయువు ఎంత అవసరమో అదే విధంగా చర్మానికి విటమిన్లు అంతే అవసరమౌతాయి. చర్మసౌందర్యాన్ని పెంపొందించేందుకు కొన్ని విటమిన్లు అవసరమౌతాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

విటమిన్‌ సి : విటమిన్‌ 'సి' అన్ని రకాల పండ్లలో లభిస్తుంది. ఉదాహరణకు నారింజ, నిమ్మకాయ, కివి వంటి సిట్ర‌స్ జాతి పండ్లలో లభిస్తుంది.

విటమిన్‌ ఏ : బొప్పాయి, కోడిగుడ్డు, . క్యారట్, గుమ్మడికాయ, చిలగడదుంప, గింజధాన్యాలు, పాలు. ఇవి వయసు ఛాయలు రాకుండా చర్మాన్ని కాపాడతాయి

విటమిన్‌ బి : ఇది పండ్లతోపాటు ఆకుకూరల్లోను పుష్కలంగా లభిస్తుంది.

విటమిన్‌ ఇ : బాదం గింజలు, వేరుశనగ, సన్ ఫ్లవర్ సీడ్స్ ఇతర నూనె గింజల్లో లభిస్తుంది.