Showing posts with label Beet Root. Show all posts
Showing posts with label Beet Root. Show all posts

Sunday 25 April 2021

బీట్ రూటు, Beet Root

దీని శాస్త్రీయ నామము "బీటా వల్గారిస్( beta vulgaris )".  ఆకులు, దుంప, రెండు తినేందుకు వాడతారు . ఆరోగ్యానికి ఎంతో మంచిది కూడా. ఎనీమియాతో బాధపడేవారు రోజూ ఒక కప్పుడు బీట్‌రూట్‌ జ్యూస్ తాగితే త్వరగా కోలుకుంటారు. 

విటమిన్‌ బి దండిగా ఉండే బీట్‌రూట్‌ చర్మం, గోళ్లు, వెంట్రుకల ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది. 

 రోజు బీట్‌రూట్‌ జ్యూస్ తాగితే రక్తపోటు తగ్గటానికి దోహదం చేస్తుంది. 

నాడుల ఆరోగ్యం, జ్ఞాపకశక్తి, కాలేయం పనితీరు మెరుగుపడటానికీ బీట్‌రూట్‌తోడ్పడును. 

గర్భిణుల్లో ఆరోగ్యకరమైన కణజాలం వృద్ధి చెందేలా చేస్తుంది. 

వైద్య పరంగా :

డయాబెటిక్ లివర్ ను కాపాడును,
కొలెస్టిరాల్ ను తగ్గించును,
మలబద్దకాన్ని నివారించును,
బీట్ రూటు జ్యూస్ రక్తపోటును తగ్గించును,
బోరాన్ ఎక్కువగా ఉన్నందున "aphrodisiac" గా సెక్స్ హోర్మోన్స్ ఎక్కువచేయును.
కొంతవరకు క్యాన్సర్ నివారణకు ఉపయోగపడును.

పోషకాలు : 100 గ్రాములలో

బీట్రూట్ 88% నీటిని కలిగి ఉంటుంది. ఇది కాల్షియం, భాస్వరం, పొటాషియం మరియు విటమిన్ A, B1, B2, B3, B9, C వంటి విటమిన్లు మరియు అనేక ఖనిజాలకు మంచి మూలం.

మాయిశ్చర్ ----87.7 %,
ప్రోటీన్లు -------1.7 %,
ఖనిజాలు -----0.8%,
పీచు --------0.9%
కార్బోహైడ్రేట్స్ -8.8%,
కాల్సియం ----18 మి.గ్రా. %,
ఫాస్పరస్ -----55 మి.గా %,
ఇనుము -----1.0 మి.గా%,
జింక్ --------0.2%,
థయామిన్‌---0.04%,
రిబోఫ్లేమిన్‌---0.09%,
నియాసిన్‌----0.4 మి.గా %,
విటమిన్‌ సి --10%,
కాలరీస్ -----43 కేలరీలు,

బీట్రూట్ దుంప ఆరోగ్య ప్రయోజనాలు - Beetroot health benefits

బరువు తగ్గడానికి:  బీట్రూట్ 88% నీరు కలిగి ఉంటుంది మరియు దానిలో కొవ్వులు చాలా తక్కువగా ఉంటాయి, అందువల్ల అది బరువును తగ్గించేందుకు మంచి ఆహారం. బీట్రూట్ పీచుపదార్థాల్ని అధికంగా కల్గి ఉంటుంది. అందువల్ల, జీర్ణక్రియకు సహాయపడుతుంది మరియు ఎక్కువ సమయం పాటు కడుపు నిండిన అనుభూతి కలిగిస్తుంది.

 మధుమేహం కోసం:  బీట్రూటు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తుంది. అందువల్ల బీట్రూటు మధుమేహ వ్యక్తుల కోసం మంచి ఆహారం.

 గుండె కోసం:  బీట్రూట్ అనేది ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ మరియు ఇది హృదయంపై ప్రయోజనకరమైన ప్రభావాలను కలిగి ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గిస్తుంది మరియు హృదయ సంబంధ రుగ్మతల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

వ్యాయామం కోసం:  బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల వ్యాయామ సమర్థత మెరుగుపడుతుంది మరియు త్వరగా అలసిపోరు. 

కాలేయం కోసం:  బీట్రూట్ హెపాటోప్రొటెక్టివ్ (కాలేయ రక్షిత) ప్రభావాలను కలిగి ఉంటుంది.  ఇది యాంటీఆక్సిడెంట్ యొక్క గొప్ప వనరుగా ఉండి, ఆక్సీకరణ నష్టం నుండి కాపాడుతుంది.

రక్తపోటు నివారణ కోసం: బీట్రూట్ రక్తపోటును తగ్గిస్తుంది. ఇందులోని నైట్రేట్లు రక్తంలో కలిశాక నైట్రిక్‌ ఆక్సైడ్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ వాయువు రక్తనాళాలను విప్పారేలా చేసి రక్తపోటు తగ్గేందుకు దోహదం చేస్తుంది.

క్యాన్సర్ నివారణ కోసం:  బీట్రూట్ యొక్క అధిక యాంటీ ఆక్సిడెంట్ శాతం క్యాన్సర్ నివారణకు సమర్థవంతంగా పని చేస్తుంది, ఇది అపోప్టోసిస్ లేదా ప్రోగ్రామ్ కణ మరణం ద్వారా సంభవిస్తుంది. బీట్రూట్ రొమ్ము క్యాన్సర్, ఇసోఫాజియల్ క్యాన్సర్, కాలేయ క్యాన్సర్ మరియు ప్రోస్టేట్ క్యాన్సర్ల  పై  వ్యతిరేక  ప్రభావాలను కలిగి ఉంది.