Showing posts with label benefits of egg. Show all posts
Showing posts with label benefits of egg. Show all posts

Monday 19 April 2021

గుడ్డు వల్ల కలిగె ప్రయోజనాలు | Health benefits of EGG

 గుడ్డు ఆరోగ్యకరమైన ఆహారం. మంచి పౌష్టికాహారం. గుడ్డులో పోషక పదార్థాలు, ప్రోటీన్స్ పుష్కలంగా లభిస్తాయి. ఒక గుడ్డు తింటే 75-80 క్యాలరీల శక్తి వస్తుంది శరీరానికి. ఎముకలు, కండరాలు గట్టిపడటంలో గుడ్డు ప్రధానపాత్ర వహిస్తుంది. గుడ్డులో ఉండే ప్రోటీన్స్ ఎంజైమ్స్, హార్మోన్స్‌ను ఉత్పత్తి చేస్తాయి. 


గుడ్డులో ఏముంటాయి?

తెల్లసొన

ఇక గుడ్డులోని తెల్ల సొనలో రైబోప్లేవిన్ లేదా విటమిన్ బీ2 పుష్కలంగా దొరుకుతుంది. వీటి వల్ల జీవక్రియ, శరీర పెరుగుదల, శక్తి ఉత్పత్తి, కణాల పని మెరుగు అవుతుంది.

నిజానికి గుడ్డులోని తెల్లసొనలో 90% నీరు ఉంటుంది. మిగిలిన 10%లో అల్బుమిన్‌, గ్లోబులిన్‌ వంటి ప్రోటీన్లు, కొద్దిగా రైబోఫ్లావిన్‌ (బీ2) కూడా ఉంటాయి. 

పచ్చసొన

పచ్చసొన 1.33 గ్రాముల కొలెస్ట్రాల్‌ను మాత్రమే కలిగి ఉంటుంది. ఇక పచ్చసొనలో విటమిన్స్ ఏ, బీ, కాల్షియం, పాస్ఫరస్, ఐరన్‌ను కలిగి ఉంటుంది. పచ్చసొనలో ఉండే ఐరన్ త్వరగా జీర్ణమై శరీరంలో కలిసిపోతుంది. త్వరగా శరీరంలో కలిసిపోయే తత్వం ఐరన్‌కు ఉన్నందున గర్భిణి స్త్రీలకు ఎంతో మేలు చేస్తుంది.

అన్ని రకాల పోషకాలూ దండిగా ఉండేది పచ్చసొనలోనే. మాంసకృత్తులు, కొవ్వు, ఎ-డి-బి12 వంటి రకరకాల విటమిన్లు, ఫోలిక్‌యాసిడ్‌, క్యాల్షియం, ఇనుము, జింకు, సెలీనియం అనే యాంటీఆక్సిడెంటు వంటివన్నీ ఉంటాయి. కాబట్టి పచ్చసొన తీసేసి తినాల్సిన అవసరం లేదు.

ఒక గుడ్డు తింటే దాన్నుంచి 75-80 క్యాలరీల శక్తి మాత్రమే లభిస్తుంది. ఇలా తక్కువ క్యాలరీలనిస్తూ, మన శరీరానికి కావాల్సిన ప్రోటీన్లను (మాంసకృత్తులను) అధికంగా అందించటం గుడ్డు ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.


1. ఒక గుడ్డు తింటే దాన్నుంచి 75-80 క్యాలరీల శక్తి మాత్రమే లభిస్తుంది

2. ఒక గుడ్డు నుంచి 6.5 గ్రాముల కొవ్వు లభిస్తుంది.

3. ఒక గుడ్డు నుంచి 1 మిల్లీగ్రాము ఇనుము లభిస్తుంది.

4. ఒక గుడ్డు నుంచి 35 మైక్రోగ్రాముల ఫోలిక్‌ యాసిడ్‌ లభిస్తుంది. ఈ ఫోలిక్‌ యాసిడ్‌ గర్భిణులకు, ఎదిగే పిల్లలకు చాలా అవసరం. 

5. ఒక గుడ్డు నుంచి  విటమిన్‌-బి12 (0.9 మైక్రోగ్రాములు) కూడా లభిస్తుంది. బి12 అనే విటమిన్‌ ఎర్రరక్తకణాలు వృద్ధి చెందటానికి, నాడీవ్యవస్థ పనితీరు బాగుండటానికి చాలా కీలకం. ఇది కేవలం జంతు సంబంధ పదార్థాల్లోనే ఉంటుంది.

6. గుడ్డు నుంచి 50 మైక్రోగ్రాముల విటమిన్‌-డి అందుతుంది కాబట్టి గుడ్డును క్రమం తప్పకుండా తీసుకుంటే విటమిన్‌-డి లోపం బారినపడకుండా చూసుకోవచ్చు.

7. గుడ్డులో 30 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. ఇది ఎముకలు, కండరాలు గట్టిపడటంలో ప్రధానపాత్ర వహిస్తుంది.

8. రైబోఫ్లావిన్‌ (విటమిన్‌ బి2) 0.4 మిల్లీగ్రాములు ఉంటుంది. ఎదుగుదలకు, చర్మం ఆరోగ్యానికి, ఆహారం సరిగా జీర్ణం కావటానికి ఈ రైబోఫ్లావిన్‌ చాలా అవసరం. ఇది గుడ్డు నుంచి తేలికగా లభిస్తుంది.