Monday 19 April 2021

కొవ్వు(Fat) / అధిక బరువును తగ్గించే డ్రింక్స్ | Fat Burning Drinks

 అధిక బరువు / కొవ్వును తగ్గిగించేవి

అధిక బరువు పెరగడానికి నిర్ధిష్టమైన కారణాలను చెప్పడం సాధ్యం కాదు.వాటిలో శారీరక శ్రమ లేకపోవడం, ఆహారపు అలవాట్లు ముఖ్యంగా చెప్పవచ్చు. 

స్థూలకాయం రావడానికి ఎన్ని కారణాలున్నాయో దీనిని నివారించడానికి అనేక మార్గాలున్నాయి.


పొద్దున్నే గోరువెచ్చని నీరు తాగాలి. రోజుకు కనీసం ఆరు లీటర్ల నీళ్లు తాగాలి.

రోజూ క్యారెట్‌ జ్యూస్‌ తాగడం మంచిది.

గోరువెచ్చటి నీళ్లల్లో కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి ఉదయాన్నే తాగితే జీర్ణక్రియకు ఎంతో మంచిది మరియు కాలేయంలోని వ్యర్థపదార్థాలను తొలగింస్తుంది.

ఆరెంజ్, బెర్రీ మొదలైన రసాలు, ద్రాక్ష రసం కొవ్వును బాగా కరిగిస్తాయి. వీటిలో పీచు అధికం. అనేక పోషకాలు, కార్బోహైడ్రేట్లు వుండి కేలరీలు, కొవ్వు అతి తక్కువగా వుంటాయి. కనుక ప్రతిరోజూ ఒక గ్లాసు క్రమం తప్పకుండా తాగండి.

ఒక గ్లాసు నీళ్లల్లో 1 లేదా 2  టేబుల్‌ స్పూన్సు యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ని వేసి బాగా కలపాలి. అన్నం తినేముందు దీన్ని తాగాలి. ఆకలిని నియంత్రించి తక్కువ ఆహారం తీసుకునేలా చేస్తుంది. జీర్ణక్రియ పెంచి శరీర మలినాలు తొలగిస్తుంది. బరువు తగ్గటానికి తోడ్పడుతుంది.

పుదీనా పొట్టచుట్టూ ఉన్న కొవ్వును కరిగించడంలో ఇది ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. గ్యాస్‌ సమస్యను తగ్గిస్తుంది. ఇందులోని యాంటాక్సిడెంట్లు జీవక్రియ సరిగా జరిగేట్టు సహాయపడతాయి. పుదీనా, కొత్తిమీర ఆకుల్ని రెండింటినీ కలిపి బాగా నూరి అందులో నిమ్మరసం వేసి పేస్టులా చేసి చిటికెడు ఉప్పు అందులో కలపాలి. దాన్ని రోటి, ఇడ్లీల్లో చెట్నీగా తింటే జీర్ణశక్తికి ఎంతో మంచిది. పుదీనాలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి.

కలబంద శరీర బరువును తగ్గిస్తుంది. 2 టేబుల్‌ స్పూన్ల కలబంద జ్యూసులో 1 టీ స్పూను ధనియాల పొడి వేసి దాన్ని అరగ్లాసు గోరువెచ్చటి నీళ్లల్లో కలిపి పొద్దున్నే ఖాళీ కడుపుతో తాగితే ఎంతో మంచిది. ఈ డ్రింకు తాగిన గంట వరకూ ఏమీ తినకూడదు.


గ్రీన్ టీ తో శరీరానికి, చర్మానికి, జుట్టుకు ఎంతో ఆరోగ్యాన్నిస్తుంది. దీనిని ఇంటిలోనే తయారు చేసుకోవచ్చు. పొట్టకొవ్వు అతి తేలికగా మాయం అవుతుంది.  గ్రీన్ టీ మీలోని మెటబాలిజం పెంచుతుంది. రోజంతా చురుకుగా వుండేట్లు చేస్తుంది. ఆకలిని కనీసం రెండు నుండి 4 గంటలు అదుపు చేస్తుంది.

కాఫీ, మితంగా తాగితే ఇది బరువు తగ్గేటందుకు అమోఘమైన ఔషధం. కాఫీలో షుగర్ కలపకండి.తీపికోసము జీరో పౌడర్ (సుగర్ ఫ్రీ) కలపంది

ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు క్రమం తప్పకుండా చేసే వ్యాయామం శరీరబరువును అదుపులో ఉంచుతుంది. రోజు అర గంట నుంచి 40నిమిషాల పాటు చేసే వ్యాయామం శరీరంలోని కొవ్వు నిల్వలను తగ్గిస్తుంది. తగ్గించి.. అనేక జబ్బుల నుంచి రక్షణ ఇస్తుంది. అన్నింటికన్నా ఉత్తమమైన వ్యాయామం నడక. జాగింగ్‌, రన్నింగ్‌, స్విమ్మింగ్‌, సైక్లింగ్‌, స్కిపింగ్‌, ఔట్‌డోర్‌ గేమ్స్‌ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అధిక బరువు సమస్యను నివారిస్తాయి. 




No comments:

Post a Comment