Sunday 25 April 2021

తేనె ( Honey ) ప్రయోజనాలు

తేనెటీగలు పువ్వులనుండి సేకరించే తియ్యటి ద్రవ పదార్థాన్నే తేనె అంటారు. స్వచ్ఛమైన తేనె ఎన్నటికి చెడిపోదు, ఎందుకంటే పంచదార కన్నా రెండు రెట్లు ఎక్కువ తీపిగా ఉండే తేనె క్రిమి సంహారక గుణాన్ని కలిగి ఉంటుంది. అందుకే ఇది బ్యాక్టీరియాని చంపే స్తుంది. తేనెలో 14 నుంచి 18 శాతం వరకు తేమ ఉంటుంది. ఇందులో నీటి శాతం కూడా తక్కువగా ఉండటంతో పులియడం, పాడవడం జరగదు. 18 శాతంకన్నా తక్కువ తేమ ఉన్న పదార్థాల్లో సూక్ష్మ జీవులు కానీ ఏ ఇతర జీవులు కానీ పెరగలేవు

ఉపయోగాలు

అధిక బరువు : తేనెను గోరువెచ్చని నీటితో పరగడుపున సేవిస్తే అధిక బరువు తగ్గుతారు. 

పాలతో: తేనెను గోరువెచ్చని పాలతో సేవిస్తే బరువు పెరుగుతారు. ఒక కప్పు వేడి పాలలో, చెంచా తేనె కలిపి పిల్లలతో తాగిస్తే అలసట దూరమై పుష్టిగా తయారవుతారు. కడుపులో క్రిములను, పుండ్లను తగ్గించడానికి, రక్తలేమిని నివారించడానికి ఇది చక్కని ఔషధం. రాత్రి పడుకునే ముందు తీసుకుంటే హాయిగా నిద్ర పడుతుంది.

మొటిమలు: తేనె (15 భాగాలు), దాల్చిన చెక్క పొడి (1 భాగం)... ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ రాత్రి పూట 2వారాలపాటు ప్రయోగిస్తే మొటిమలు తగ్గుతాయి.

కీళ్ల నొప్పి: 2 చెంచాలు తేనెను కప్పు దాల్చిన చెక్క కషాయానికి కలిపి పుచ్చుకుంటే కీళ్లనొప్పిలో ఉపశమనం లభిస్తుంది.

జలుబు, దగ్గు, గొంతునొప్పి: తేనె (4్భగాలు), పిప్పళ్ల పొడి (1 భాగం), మిరియం పొడి, లవంగాల పొడి, జీలకర్ర పొడి కలిపి గొంతు తగిలేలా పుక్కిట పడితే గొంతునొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

పిల్లల్లో విరేచనాలు: తేనెకు జాజికాయ పొడిని కలిపి ఇస్తే అతిసారం తగ్గుతుంది.

తేనె టీ: పొద్దున్నే కాఫీ, టీలకు బదులుగా తేనె టీ తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. పరగడుపున కప్పు వేణ్నీళ్లలో చెంచా తేనె కలిపి మెల్లగా చప్పరిస్తూ తాగాలి. అజీర్తి సమస్యలకు ఇది చక్కని ఔషధం. రోజుకు రెండు మూడు సార్లు తాగినా మంచి ఫలితం ఉంటుంది.

నిమ్మరసంతో: కప్పు వేణ్నీళ్లలో కొంచెం నిమ్మరసం, చెంచా తేనెను బాగా కలపాలి. కాలేయ సమస్యలున్న వాళ్లు దీన్ని తాగితే మంచి ఫలితాలుంటాయి. దగ్గు , గొంతు నొప్పులకు బాగా పనిచేయును. ముఖ వర్ఛస్సు పెరుగుతుంది. శరీరం మీద మచ్చలు చాలా తేలిగ్గా తగ్గుతాయి. పడుకునే ముందు తాగితే జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. దగ్గు , గొంతు నొప్పులకు బాగా పనిచేయును


No comments:

Post a Comment