Monday 19 April 2021

మెంతులు వల్ల ఆరోగ్యానికి కలిగె ప్రయోజనాలు | Benefits of Fenugreek

 మెంతులు (Fenugreek)

ప్రతి రోజూ మన ఆహారంలో ఏదో ఒక రూపంలో మెంతులను వాడుతుంటాం. మెంతి గింజలను చారు, పులుసు, పోపులోనూ, మెంతి పొడిని ఊరగాయల్లోనూ వాడతాం. మెంతి ఆకులు ఆకుకూరగా ఉపయోగిస్తారు. 

మెంతులు, మావన శరీరంలోని విషాలను (టాక్సిన్లు) బయటకు పంపించి, వూపిరితిత్తుల క్యాన్సర్‌ రాకుండా కాపాడతాయి, శరీరంలో త్వరగా కరిగేపోయే పీచు దీనిలో ఎక్కువగా లభిస్తుంది. ఆయుర్వేదం, మెంతులు, మెంతి కూరను ప్రతి రోజూ వాడమంటుంది.

మెంతులు ఆకలిని పెంచుతుంది, స్థూలకాయం, చెడు కొలెస్టరాల్‌, మధుమేహం అదుపునకు ఇవి దోహదపడతాయి. కఫాన్ని పల్చన చేసి వెలుపలకు తెస్తుంది, మూత్రాన్ని జారీ చేస్తుంది, మలాన్ని తయారయ్యేలా చేస్తుంది, చెమటను పుట్టించి శరీరాన్ని చల్లబరుస్తుంది, కామశక్తిని పెంచుతుంది. అందుకని మెంతులు రోజూ మన ఆహారంతో పాటు తీసుకుంటే, మన ఆరోగ్యంగా ఉండచ్చు. 


100 గ్రాముల మెంతి గింజల్లో పోషక విలువలు

పిండిపదార్థాలు 44.1 % 

ప్రోటీన్లు 26.2 % 

కొవ్వు పదార్థాలు 5.8 %

పీచు పదార్థం 7.2 % 

తేమ 13.7 %

కాల్షియం 17%

ఐరన్, పాస్పరస్‌, కెరోటిన్‌, థయమిన్‌, నియాసిన్‌ కూడా ఉంటాయి. అరగడానికి రెండు గంటలు పడుతుంది. 333 కిలో కేలరీల శక్తి విడుదలవుతుంది. 


మెంతులు వలన ఆరోగ్యానికి కలిగె ప్రయోజనాలు.

2-4 చెంచాలు గింజలను రాత్రి నానబెట్టి ఉదయం భోజనానికి ముందు తీసుకుంటే ప్రాథమిక దశలో ఉన్న మధుమేహం (చక్కెరవ్యాధి) అదుపులోకి వస్తుంది. 

నీటిలో నానబెట్టిన మెంతులను ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు తీసుకుంటే అధికంగా ఉన్న కొవ్వు(కొలెస్టరాల్) తగ్గుతుంది.

ఒక చెంచా మెంతులను మీ భోజనంలో తీసుకోవడం ద్వారా ఎసిడిక్ రిప్లెక్షన్ మరియు హార్ట్ బర్న్ తగ్గిస్తుంది.

శ్వాస సంబంధిత సమస్యలకు తొలిదశలోనే మెంతులు ఉపయోగించినట్లయితే సులభంగా తగ్గించుకోవచ్చును. బ్రాంకైటిస్, సైనసైటిస్, ఇన్‌ఫ్లుయంజా, న్యూమొనియా, వంటి జబ్బులకు మంచి మందుగా మెంతులు పనిచేస్తాయి. మెంతి టీ (మెంతులతో తయారుచేసిన తేనీరు)తీసుకోవడంవల్ల శ్వాస సంబంధ సమస్యలను అడ్డుకోవచ్చును.

కడుపు, కడుపులోని పేగులను మెంతులు శుద్ధి చేస్తాయి. మెంతులు గ్యాస్ట్రిక్ ఇబ్బందులకు, మల బద్ధకానికి, కడుపులో వచ్చే అల్సర్లకు అద్భుతమైన మందు. దీనిలోని సహజమైన జీర్ణ శక్తిని పెంపొందించే అంశాలు జీర్ణాశయాన్నీ, ప్రేగుల పనితీరునూ మెరుగుపరుస్తాయి.

మలబద్దకంగా ఉంటే 2-3 చెంచాల గింజలు నానబెట్టి తింటే విరేచనం సాఫీగా అవుతుంది.

మెంతి గింజల పచ్చిపిండిని పాలలో కలిపి ముఖానికి రాసుకుంటే ముఖం నున్నగా తయారవుతుంది. మెంతి పొడి పట్టించి స్నానం చేస్తే చుండ్రు, వెండ్రుకలు రాలడం తగ్గుతాయి. మెంతి పిండి మంచి కండీషనర్‌గా పనిచేస్తుంది.

మగవాళ్ల ప్రత్యేక సమస్యలు: మెంతుల్లోని ప్రత్యేక తత్వాలు శీఘ్రస్కలనం, లైంగిక స్తబ్దత, అంగస్తంభన సమస్యలు ఇలాంటి వాటిని తగ్గిస్తాయి. కామశక్తిని పెంచుతుంది.

నొప్పి: మెంతులు వాతహరంగా పని చేస్తుంది కాబట్టి దీనిని నడుము నొప్పి, సయాటికా, కీళ్లనొప్పి, వాపులు, కండరాల నొప్పి ఇలాంటి వాటిల్లో వాడుకోవచ్చు.అస్త్ధితువును (ఎముకలు) ఇది శక్తివంతం చేయటం వల్ల ఆస్టియోపోరోసిస్, నడుమునొప్పి, జుట్టు రాలటం, ఎముకల బలహీనత వంటి సమస్యల్లో ఇది ఔషధంగా పని చేస్తుంది.




No comments:

Post a Comment