Sunday 9 May 2021

రాగుల ప్రయోజనాలు | Benefits of Ragi (Finger Millet)

రాగి (Finger Millet) (ఎల్యూసీన్ కొరకానా, అమ్హరిక్లో తోకూసో) ని ఫింగర్ మిల్లెట్ లేదా ఆఫ్రికన్ మిల్లెట్ అని వ్యవహరిస్తారు. రాగి తృణధాన్యం పంట.

రాగులు తినడంవల్ల మనం పొందుతున్న ఆరోగ్య ప్రయోజనాలకుగాను ఆ కీర్తి (క్రెడిట్) రాగుల్లోని ఆహార పీచుపదార్థాలు (dietary fibre) మరియు పోలీఫెనాల్ (polyphenol) పదార్థాలకు దక్కుతుంది. 

రాగుల్లో ఇతర తృణధాన్యాలలో కంటే ఎక్కువ అధిక ఖనిజ పదార్థాలున్నాయి. తృణధాన్యాలైన రాగులలో కాల్షియం, పొటాషియం , కార్పోహైడ్రేట్లు,  ఫైబర్  పదార్థాలు అధికంగా ఉన్నాయి. దీంతోపాటు B1, B2, B3  విటమిన్లు, ఐరన్ సమృద్ధిగా ఉన్నాయి.

రాగుల్లో ఇనుము అధికంగా ఉండడం మూలంగా రక్తహీనత తగ్గటానికి దోహదం చేస్తుంది. అదనంగా, రాగులు గ్లూటెన్ (బంక పదార్ధం) రహితంగా ఉంటాయి మరియు తక్కువ కొవ్వు పదార్థాల్ని మాత్రమే కల్గి ఉంటాయి. కాబట్టి, సులభంగా జీర్ణమవుతుంది మరియు గ్లూటెన్-అసహనాన్ని కలిగినవారికి రాగులతో చేసిన ఆహారం సురక్షితంగా ఉంటుంది. శాకాహారులకు అవసరమైన ప్రోటీన్ యొక్క ఖచ్చితమైన మూలం రాగులే.

రాగుల యొక్క ఆరోగ్య ప్రయోజనాలు - Health benefits of Ragi 

ఎముక పుష్టికి : వీటిల్లో క్యాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. ముఖ్యంగా పిల్లల్లో ఎముకల ఎదుగుదలకు, మహిళలు ఎముకల పటుత్వానికి, వృద్ధుల్లో ఎముకలు ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడతాయి.

అధిక బరువు తగ్గటానికి :  రాగులలో ట్రీప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ కలిగి ఉంటుంది ఇది ఆకలిని తగ్గిస్తుంది మరియు బరువును నియంత్రణలో ఉంచుతుంది.   రాగులలో అధిక శాతంలో డైయిటరీ  ఫైబర్ ఉంటుంది, ఇది జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది మరియు ఎక్కువ సమయం పాటు కడుపు నిండిన భావనను కలిగించి, ఎక్కువగా తినకుండా చేస్తాయి. ఇవన్నీ బరువు తగ్గాలనుకునే వారికి రాగులు మంచి ఆహారం. 

మధుమేహం నియంత్రణకు :  రాగుల్లో ఉండే పాలిఫినాల్స్, డైటరీ ఫైబర్ మధుమేహాన్ని నియంత్రిస్తాయి.  రాగులు వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు మధుమేహ రోగులకు ఎంతో ఉపయోగకరంగా  ఉంటాయి, ఇవి జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది తద్వారా రక్తంలోకి గ్లూకోజ్ నెమ్మదిగా విడుదల అవుతుంది.

కొలెస్ట్రాల్ తగ్గేందుకు :  రాగుల్లో లెసిథిన్, మెథియోనైన్ అనే అమైనో ఆమ్లాలు కాలేయంలో అదనపు కొవ్వును నిర్మూలిస్తుంది. ఇక థ్రియోనైన్ అమైనో ఆమ్లమైతే కాలేయంలో కొవ్వు ఏర్పడకుండా చూస్తుంది.

రక్తహీనత (అనీమియా) :  రాగుల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. రాగిని తీసుకోవడం వల్ల అనిమియాను నివారించడానికి సహాయపడుతుంది.

ఆందోళన :  వీటిల్లోని ట్రిప్టోఫాన్ అమైనో ఆమ్లం శారీరక, మానసిక ప్రశాంతతకు దోహదం చేస్తుంది. అందువల్ల ఆందోళన, కుంగుబాటు, నిద్రలేమి వంటి సమస్యల నివారణకు తోడ్పడతాయి. 

వయస్సును తగ్గిస్తుంది :   రాగుల్లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటుంది. అందువల్ల,  చర్మం కాంతివంతంగా, మృదువుగా ఉంటుంది. ఎప్పుడూ యవ్వనంగా కనిపిస్తారు.




No comments:

Post a Comment